Telangana రాష్ట్ర కార్యాలయంలో BJP సంబురాలు

హైదరాబాద్, మే 04 (ఇయ్యాల తెలంగాణ) :  సోమవారం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బిజెపి కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఉత్సాహభరిత వాతావరణంలో భారీగా సంబురాలు జరుపుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు కలిసి స్వీట్లు పంచుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలియ జేసుకున్నారు. ఈ వేడుకల్లో బిజెపి రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్క్ష్మణ్ , బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్సీ అంజిరెడ్డి , బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు , బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్  ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....