7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

హైదరాబాద్, ఆగస్టు 01 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ రాష్ట్రంలో వివిధ పోలీసు పోస్టుల నియామకానికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల షెడ్యూల్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. నిరుద్యోగ అభ్యర్థుల నుంచి ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించిందితెలంగాణలో మొత్తం 7,437 పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSఒఖఖీః) బుధవారం నోటిఫికేషన్లను విడుదల చేయడం తెలిసిందే. ఇందులో భాగంగా పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్), అగ్నిమాపక, జైళ్ల శాఖలకు చెందిన ఖాళీల భర్తీ కోసం నాలుగు వేర్వేరు ప్రకటనలను బోర్డు జారీ చేసింది.  కానిస్టేబుల్ స్థాయి పోస్టులే అధికంఈ నియామక ప్రక్రియలో అత్యధికంగా కానిస్టేబుల్, సమాన స్థాయి పోస్టులే ఉన్నాయి. మొత్తం ప్రకటించిన ఖాళీలలో దాదాపు 7,000 వరకు పోస్టులు కానిస్టేబుల్ స్థాయికి చెందినవే ఉన్నాయి. 

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అభ్యర్థులు సన్నద్ధం కావాలని బోర్డు తెలిపింది.

పోలీస్ విభాగం.. పోస్టుల సంఖ్య`  సివిల్ ఎస్సై: 148`  ఏఆర్ ఎస్సై: 14`  టీజీఎస్పీ ఏఆర్ ఎస్సై: 12`  ఎనఆరఈఆర్ సీపీఎల్ ఎస్సై: 3`  ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై: 23`  సివిల్ కానిస్టేబుల్: 3,697`  ఏఆర్ కానిస్టేబుల్: 1,052`  ఎనఆరఈఆర్ సీపీఎల్ కానిస్టేబుల్: 24`  కానిస్టేబుల్ (డ్రైవర్) పిటిఓ: 20`  కానిస్టేబుల్ (మెకానిక్) పిటిఓ: 7

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....