వెండి బోనమెత్తిన Telangana చైర్పర్సన్ కొల్లె సరిత

అలంపూర్, జూలై 20 (ఇయ్యాల తెలంగాణ) : ఆషాడ మాస బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ పాతబస్తీ మురాద్ మహల్ నల్ల పోచమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలోనివెండి బోనాన్ని తెలంగాణలోని ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ లో  తెలంగాణ రాష్ట్ర గొర్రెల& మేకల కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ కొల్లే సరిత (తిరుపతయ్య కురుమ) సమర్పించారు. కొల్లె సరిత మాట్లాడుతూ తెలంగాణలో బోనాల జాతర చాలా ప్రాముఖ్యం పొందిందని,(2025 నుండి మురాద్ మహల్ )హైదరాబాదు నగరం నుంచి  బోనాలను సమర్పించడం చాలా సంతోషంగా ఉందని శుభ సూచకమేమంటే బోనం అమ్మవారి గడపలోకి రాగానే వర్షం రావడం శుభసూచకమని అలాగే రైతుల కళ్ళల్లో ఆనందం, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని, అలాగే ఈ మురాద్ మహల్ దేవాలయ కమిటీ సభ్యులకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగితే బాగుంటుందని ప్రతి ఇంటి నుండి ఇంతమంది కుటుంబ సభ్యులు రావడం చాలా సంతోషంగా ఉందని సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి (జోగులాంబ నియోజకవర్గం ) మహాలక్ష్మి సంపత్ కుమార్, శివానంద స్వామి, వెంకటేశ్వర్లు (జోగులాంబ దేవాలయం)  ఎక్స్ చైర్మన్, జోగిని (ఠాగూర్ ఐషు) బృందం, నల్ల పోచమ్మ దేవాలయం కమిటీ చైర్మన్ (మురాద్ మహల్ ) చిట్టెం శ్యామ్ రావు, సీనియర్ అడ్వైజర్ ఎడ్మ సత్తెప్ప, కంకర్ల  సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్, ఆవుల మణికంఠ ప్రధాన కార్యదర్శి, దొంగిడి ప్రమోద్ మరియు అడ్వైజర్లు కమిటీ సభ్యులు బస్తీ వాసులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....