3 కోట్ల 36 లక్షలు Voters డిజిటలైజేషన్ పూర్తి

హైదరాబాద్, ఆగస్టు 11, (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ  ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ భారీ సవరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రాథమికంగా లెక్క తేల్చారు. సేకరించిన సమాచారంలో ఇప్పటి వరకు దాదాపు 2.64 కోట్ల ఫారాలను డిజిటలైజేషన్ పూర్తి చేయగా, నమోదు ప్రక్రియ 78.30 శాతానికి చేరింది. అయితే ఈ నమోదు సరళిని గమనిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర ఓటర్ల జాబితా స్వరూపమే మారిపోనుందని స్పష్టమవుతోంది.మరోవైపు, క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులకు సవాలుగా మారిన అనేక అంశాలు వెలుగుచూశాయి. మొత్తం 73.39 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలను (21.70 శాతం) వివిధ కారణాల వల్ల సేకరించలేకపోయినట్లు అధికారులు ‘అన్‌కలెక్టబుల’గా వర్గీకరించారు. ఇందులో అత్యధికంగా 45.18 లక్షల మంది ఓటర్లు తమ నివాస ప్రాంతాల నుంచి శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు గుర్తించగా, 9.22 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు నమోదైంది. మరో 11.25 లక్షల మంది అసలు జాడ తేలక అడ్రస్ దొరకని స్థితిలో ఉండగా, 6.70 లక్షల మందికిపైగా ఇప్పటికే వేర్వేరు ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదై ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ భారీ వ్యత్యాసాలు, వలసల గణాంకాల నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా ప్రక్షాళనలో ఊహించని పెద్ద మార్పులు చోటుచేసుకోనున్నాయి.

రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, సోమవారం సాయంత్ర నాటికి కేవలం 2,64,73,616 మంది (78.26 శాతం) వివరాలు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. మిగిలిన 73,52,832 మంది ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలను బూత్ లెవెల్ ఆఫీసర్లకు సమర్పించలేదు. లేదా వారు అందుబాటులో లేరు. ఈ ఓటర్లను అధికారులు ఏఎన్‌డీ(ఆబ్‌సెంట్, షిప్టెడ్, డెడ్) జాబితాలో చేర్చారు.ముఖ్యంగా ఇప్పుడు గల్లంతైన ఓట్లలో అన్‌కలెక్టబుల్ జాబితాలో ఎక్కువ ఉన్నాయి. తర్వాత స్థానంలో నివాస ప్రాంతాల నుంచి శాశ్వతంగా వల వెళ్లినట్టు గుర్తించారు. మిగతావి డూప్లికేట్ ఓట్లు అంటే ఒకే వ్యక్తికి రెండు లేదా మÖడు చోట్ల ఓట్లు ఉన్నట్టు తేలింది. ఓటరు జాబితాను పారదర్శకంగా మార్చటానికి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్షాళన చేపట్టింది. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించినప్పుడు చాలా మంది ఓటర్లు అందుబాటులో లేకపోవడం లేదా ఆధారాలు చూపకపోవడం వల్ల వారి పేర్లు గల్లంతవుతున్నాయి.మరో కీలక అంశం అంటే, గతంలో మ్యాపింగ్ సర్వే నిర్వహించినప్పుడు సుమారు 89 లక్షల ఓట్లలో 11 రకాల తేడాలను గుర్తించారు. వీటిని సవరించిన తర్వాత కూడా ఇప్పటికే యాభై లక్షలకుపైగా ఓట్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఓటర్లను కూడా ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 

ప్రభావం ఎక్కువ ఎక్కడ ఉంది?

ఈ ఓట్ల గల్లంతు ప్రభావం గ్రావిÖణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా ఉంది. ఇక్కడ దాదాపు అరవై శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తి అయ్యింది. అంటే దాదాపు 20 లక్షల ఓట్లు ఏఎస్‌డీ జాబితాలోకి వెళ్లాయి. మేడ్చల్`మల్కాజగిరిలో 70 శాతం డిజిటలైజేషన్ జరిగింది. రంగారెడ్డిలో 65 శాతం డిజిటలైజేషన్ జరిగింది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా 95 శాతం డిజిటలైజేషన్‌తో అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో 92 శాతంతో జనగామా, 91 శాతంతో మెదక్, సూర్యాపేట ఉన్నాయి. 

ఎప్పుడు ఏం జరుగుతుంది?

ఓటర్లు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఇంకా సమయం ఉంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు స్వీకరిస్తారు. అక్టోబర్ 15 లోపు వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తారు. అక్టోబర్ 19న తుది జాబితా విడుదల చేస్తారు. 

ఓటును ఎలా కాపాడుకోవాలి?

ఒక వేళ విÖ పేరు ముసాయిదా జాబితాలో లేకపోయినా, లేదా ఏఎన్‌డీ జాబితాలో ఉన్నా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆగస్టు 17 తర్వాత ఈ`పోర్టల్ లేదా ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌లో విÖ పేరు ఉందో లేదో సరిచూసుకోండి. ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సంబంధిత ఎలక్టోరల్ రిజిస్టేషన్ అధికారికి సమర్పించాలి. ఒక వేళ పేరు తొలగించినట్టు అయితే, ఫారం `6 ద్వారా కొత్తగా మోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.  ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వలేదనే కారణంతో నేరుగా ఓటు తొలగించు. అధికారులు నోటీసులు ఇచ్చి, విచారణ చేసిన తర్వాతే తుది నిర్ణం తీసుకుంటారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....