యువ Engineer ల శిక్షణ బాధ్యతను పరిశ్రమలు స్వీకరించాలి : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్, మే 04 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణాలో ఏటా చదువులు పూర్తి చేసుకుంటున్న 2 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి, ఉద్యోగాలకు సంసిద్దులను చేసే కర్తవ్యాన్ని పరిశ్రమలు స్వీకరించాలని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. యÖనివర్సిటీ చదువులకు, ఇండస్టీ అవసరాలకు అంతరం పెరిగినందున ప్రతి సంస్థ తమ బాధ్యతగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని శ్రీధర్ బాబు సూచించారు. నగరానికి చెందిన పిఎస్ ఆర్ టెక్ హబ్  సంస్థ పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నాడు బేగంపేట లోని వివాంతా హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. టెక్నాలజి రంగంలో నిత్యం ఎదురయ్యే పెను సవాళ్లను అధిగమించి పదేళ్లలో రూ.120 కోట్ల సంస్థగా నిలదొక్కుకునేలా చేయడం పట్ల పిఎస్ టెక్ హబ్ అధినేత పి. శ్రీరంగారావును శ్రీధర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. కరోనా సమయంలో ఎన్నో సంస్థలు మÖతపడటమో, నష్టాలకు గురికావడమో జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. టెక్నాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మక ఆవిష్కరణలు, ఏఐ లాంటి సవాళ్లను ఎదుర్కొని 250 మంది ఉద్యోగులకు భరోసానివ్వడం సాధారణ విషయం కాదని శ్రీధర్ బాబు కొనియాడారు. వేగంగా విస్తరిస్తున్న ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొనేలా వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీర్ల నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు.

‘ఏఐ హబ’ పేరుతో ప్రత్యేక శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి వచ్చే రెండు నెలల్లో రీస్కిల్లింగ్  కార్యక్రమాలు ప్రారంభిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు.భారీ విస్తరణకు ప్రణాళికలు: పిఎస్ ఆర్ టెక్ హబ్ దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసి సేవలను అందిస్తోందని డైరెక్టర్ పి. నమ్యుత తెలిపారు. వచ్చే మÖడేళ్లలో దేశం వెలుపల కార్యాలయాలను విస్తరించి ఉద్యోగుల సంఖ్యను 1,000 కి పెంచుతామని వివరించారు. మంత్రి సూచన మేరకు చదువులు పూర్తయిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి, ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు, క్లయింట్లు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....