నాగర్ కర్నూల్, ఆగస్టు 01 (ఇయ్యాల తెలంగాణ) : క్లాస్మేట్ క్లబ్ 365 రోజులు 365 కార్యక్రమాలలో భాగంగా 213 వ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభ దినోత్సవం పురస్కరించుకుని క్లాస్మేట్ క్లబ్ వ్యవస్థాపకులు వాస రాఘవేందర్ సూచన మేరకు తాడూరు మండలం ఆధ్వర్యంలో ఎంపీపీఎస్ తాడూరు ష్ట్రలి పాఠశాల లో ఒకటో తరగతి విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓ.ఆ. విజయ్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాండూర్ మండల విద్యాధికారి శ్రీ త్యాగరాజు గౌడ్ పాల్గొని మాట్లాడుతూ సమయోధుల సేవలను కొనియాడారు క్లాస్మేట్ అందిస్తున్న సహారాన్ని తీసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమలో తాడూరు క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస ఆచార్యులు గారు మరియు ఉపాధ్యాయులు రాధిక, లక్క్ష్మి, రాములు పాల్గొనడం జరిగింది అదేవిధంగా పెద్ద ముద్దునూరు పాఠశాల యందు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది.
- Homepage
- Telangana News
- క్లాస్మేట్ Club ఆధ్వర్యంలో Bags పంపిణీ
క్లాస్మేట్ Club ఆధ్వర్యంలో Bags పంపిణీ
Leave a Comment