లష్కర్ బోనాల ఉత్సవాల్లో ముగిసిన రంగం

👉 భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

👉 కంట తడి పెట్టిన మాతంగి స్వర్ణలత

👉 నా విగ్రహ ప్రతిష్ట ఎందుకు చేయడం లేదు.. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ట జరగాలి

👉 నాకు అడ్డొచ్చిన వారిని పాదాల కింద నలిపేస్తా

👉 ఈ ఏడాది భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది.

👉 వావి వరసలు లేకుండా ప్రజలు వ్యవహారిస్తున్నారు

👉 మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలి

👉 ఏ ఆపద వచ్చినా ప్రమాదం నుంచి కాపాడుతున్నా

👉 ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి

👉 ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు : భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

హైదరాబాద్, ఆగస్టు 03 (ఇయ్యాల తెలంగాణ) :  సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు` ఘనంగా ముగిసాయి. సోమవారం భవిష్యవాణి (రంగం) కార్యక్రమంలో పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపించింది. భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత కంట తడిపెట్టింది. ` ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిమ్మలను ఇంత కింతకు కాపాడుకుంటూ వస్తున్నా, తనను మాత్రం సంతోష పరచడం లేదని తెలిపింది. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ట జరగాలని హెచ్చరించింది.ఈ ఏడూ కుంభవర్షాలతో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని ప్రాణనష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించింది. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. వావివరసలు లేకుండా జనాలు ప్రవర్తిస్తారని భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత తెలిపింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....