హైదరాబాద్, మే 04 (ఇయ్యాల తెలంగాణ) : సోమవారం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బిజెపి కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఉత్సాహభరిత వాతావరణంలో భారీగా సంబురాలు జరుపుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు కలిసి స్వీట్లు పంచుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలియ జేసుకున్నారు. ఈ వేడుకల్లో బిజెపి రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్క్ష్మణ్ , బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్సీ అంజిరెడ్డి , బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు , బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
