హైదరాబాద్, మే 08 (ఇయ్యాల తెలంగాణ) : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10వ తేదీన తెలంగాణలో పర్యటిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచందర్‌రావు వ్యాఖ్యానించారు.ఈ సభ తర్వాత తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాయని పేర్కొన్నారు. ఈ సభ ఏర్పాట్లు అన్ని దాదాపు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. పరేడ్ గ్రౌండ్‌లో మోదీ హాజరయ్యే సభ ఏర్పాట్లను శుక్రవారం రామచందర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రాధాన్యం..ఈరోజు నుంచి రెండు రోజులపాటు పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలు అన్ని కేంద్ర బలగాల అధీనంలోకి వెళ్తాయని వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల ముందు మోదీ సభ జరగడం తమ పార్టీకి కలిసి వచ్చే అంశమని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో మోదీ ప్రాధాన్యం చాలా ఉందని ఉద్ఘాటించారు. రెండు లక్షలకు పైగా మందితో ఈ సభ సక్సెస్ కాబోతుందని అన్నారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు స్వచ్చందంగా మోదీ సభ కోసం తరలి వస్తున్నారని తెలిపారు.ఈ సభ కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేశామని రామచందర్‌రావు పేర్కొన్నారు.