PM మోదీ సభ తరువాత BJP మరింత బలోపేతం : కిషన్ రెడ్డి

హైదరాబాద్, మే 08 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆరఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. తెలంగాణ రాష్టానికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారంపై వీరిద్దరికి అవగాహన లేనట్లు ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ. ఈ పన్నెండు ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్టానికి అందించిన సహకారంపై తాము ఎప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభ తరువాత తెలంగాణలో మరింత బలోపేతం అవుతామని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమం కాదన్నారు.ఇది అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ నేరుగా తెలంగాణలో శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాల కంటే ముందే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయిందని చెప్పారు. తమిళనాడులో రాజ్యాంగ బద్ధంగా ఏ ప్రభుత్వం అయినా ఏర్పాటు చేయవచ్చునన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....