జనాభాకు అనుగుణంగా అభివృద్ధి CM రేవంత్

హైదరాబాద్, మే 09 (ఇయ్యాల తెలంగాణ) : గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పై రాష్ట్ర సచివాలయంలో జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్ లో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నగరాన్ని ట్రాఫిక్ రహిత, పార్కింగ్ సమస్య రహిత, పొల్యూషన్ రహిత నగరంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మొత్తం తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్  జోన్లుగా వర్గీకరించి, అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నాం.  మÖసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయడంతో పాటు మన సంస్కృతికి అనుసంధానించబోతున్నామని అన్నారు. 

ఈ సమావేశానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అధ్యక్షత వహించగా, పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....