భద్రచాలం, ఆగస్టు 01 (ఇయ్యాల తెలంగాణ) : భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శనివారం ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55.1 అడుగులకు చేరడంతో అధికారులు మÖడో, చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం కేవలం 30 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం, కాళేశ్వరం నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శుక్రవారం అర్ధరాత్రికి 53 అడుగులకు, శనివారం ఉదయానికి 55.1 అడుగుల ప్రమాదకర స్థాయికి చేరింది. పరిస్థితిని సవిÖక్షించిన జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్.. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించారు.
వరద ఉద్ధృతి కారణంగా పర్ణశాల వద్ద స్నానఘట్టాలు పూర్తిగా జలమయమయ్యాయి. సీతవాగు ఉద్ధృతికి సీతమ్మ నార చీరలు, దేవతామÖర్తి పీఠంతో పాటు ఇనుప వంతెన కూడా మునిగిపోయాయి. దుమ్ముగూడెం` భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచే రాకపోకలు నిలిచిపోయాయి. తురుబాక ఆర్ అండ్ బీ రహదారిపై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్లు కోతకు గురై ప్రమాదకరంగా మారాయి.చార్ల మండలం వీరాపురం శివారులోని ఇసుక క్వారీలో అకస్మాత్తుగా వరద రావడంతో 44 మంది లారీ డ్రైవర్లు, స్థానికులు చిక్కుకు పోయారు. అధికారులు వారిని సురక్షితంగా కాపాడారు. అయితే 30కి పైగా లారీలు అక్కడే నీటిలో చిక్కుకు పోయాయి. సహాయక చర్యల సమయంలో ఇద్దరు పోలీసు అధికారులు తెప్పపై నుంచి నీటిలో పడినా, ఈదుకుంటూ క్షేమంగా బయటపడ్డారు. అశ్వాపురం మండలంలో ఓ గర్భిణిని థర్మాకోల్ తెప్పపై సురక్షిత ప్రాంతానికి తరలించారు.మరోవైపు, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.