‘కొరియన్ కనకరాజు’ Movie ట్రైలర్ ను Launch చేసిన రామ్ చరణ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీని యÖవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్, రెండు చార్ట్‌బస్టర్ పాటలు సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి అంచనాలను మరింత పెంచేశారు.

సత్య,అతని తండ్రి, రీతికా నాయక్ కలిసి ‘కొరియన్ కనకరాజు’ ఆత్మను ఆహ్వానించేందుకు క్షుద్ర పూజ చేయడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథ పెనుకొండకు చెందిన ఓ కుర్రాడి జీవితంలోకి వెళ్తుంది. కియా ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయితో ప్రేమలో పడిన అతని జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. ఓ కొరియన్ అండర్‌వరల్డ్ డాన్ ఆత్మ అతనిలోకి ప్రవేశించడంతో హీరో పూర్తిగా మారిపోతాడు. అక్కడి నుంచి మొదలయ్యే నవ్వులు, థ్రిల్స్‌తో కూడిన ప్రయాణాన్ని ట్రైలర్ ఆసక్తికరంగా ప్రజెంట్ చేసింది

మేర్లపాక గాంధీ ఈసారి పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాయలసీమ నేటివిటీని కొరియన్ కల్చర్ తో మేళవించిన తీరు ఆకట్టుకుంటోంది. హారర్, కామెడీ, యాక్షన్, ఎమోషన్‌ను బ్యాలెన్స్ చేస్తూ ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఫైర్ వర్సెస్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్‌గా అదిరిపోయింది. చివర్లో కొరియన్ డాన్ ఆత్మ ఆవహించిన వరుణ్ తేజ్ పాత్రకు భయపడే సత్య ఎపిసోడ్ నవ్వులు పంచుతూ ట్రైలర్‌ను హై నోట్‌లో ముగిస్తుంది.

వరుణ్ తేజ్ రెండు విభిన్న షేడ్స్‌లో అదరగొట్టారు. అమాయకమైన రాయలసీమ యువకుడిగా, భయంకరమైన కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ఆవహించిన వ్యక్తిగా ఆయన చూపించిన వేరియేషన్స్ హైలైట్‌గా నిలిచాయి. రాయలసీమ యాస, బాడీ లాంగ్వేజ్, కొరియన్ మ్యానరిజమ్స్‌తో వరుణ్ తేజ్ తన నటనలో మరో కొత్త కోణాన్ని చూపించారు. సత్య తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో మరోసారి నవ్వులు పంచగా, రీతికా నాయక్ తన పాత్రలో ఆకట్టుకున్నారు. అలాగే సునీల్, మురళీధర్ గౌడ్ తదితర కీలక పాత్రల్ని కూడా ట్రైలర్‌లో ఆకట్టుకునేలా చూపించారు.

మనోజ్ రెడ్డి కటసాని సినిమాటోగ్రఫీ రాయలసీమ, కొరియా లొకేషన్స్‌ను గ్రాండ్‌గా ప్రజెంట్ చేసింది. ఎస్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌కు అదిరిపోయే ఎనర్జీని తీసుకొచ్చింది. సత్య జి ఎడిటింగ్ ట్రైలర్‌ను ఫాస్ట్`పేస్డ్‌గా, ఎంగేజింగ్‌గా నిలబెట్టింది. యÖవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లో ఉన్నతంగా కనిపిస్తున్నాయి.

’కొరియన్ కనకరాజు’ ట్రైలర్… హారర్, కామెడీ, యాక్షన్, ఎమోషన్‌లతో కూడిన పూర్తి వినోదాన్ని అందించే థియేట్రికల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాపై అంచనాలు పెంచింది.  ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. ట్రైలర్ విÖ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌తో మిమ్మల్ని అలరించాలని ఈ సినిమా చేశాం. ఆగస్టు 7న థియేటర్లలో ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. మా టీమ్ అందరికీ థ్యాంక్యూ. ఈ సినిమా మా అందరికీ ఒక బ్యూటిఫుల్ జర్నీ. ప్రేక్షకులకు కూడా అదే స్థాయిలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నించాం.  ఈ సినిమా కొరియాలో షూట్ చేసినప్పటికీ భాష విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ఇందులో నేను రెండు పర్సనాలిటీస్‌లో కనిపిస్తాను. డైరెక్టర్ గారితో కలిసి ప్రతి క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేదానిపై మంచి హోంవర్క్ చేశాం. సినిమాలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కథతో చాలా నేచురల్‌గా ట్రావెల్ అవుతాయి. ఇది పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్. ఒకే బాడీలో రెండు ఆత్మలు ఉంటే ఎలాంటి ఛాలెంజెస్ వుంటాయి. పెర్ఫార్మెన్స్‌కు మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. డైరెక్టర్ రాసుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నించాను. ఈ సినిమా చేయడం నటుడిగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది.

రీతికా నాయక్ మాట్లాడుతూ:”అందరికీ నమస్కారం. ట్రైలర్‌కు విÖరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. విÖరు కూడా థియేటర్‌లో అంతే ఫన్నీ ఎక్స్‌పీరియన్స్‌ను పొందుతారు. మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్యూ. మా కో`ఆర్టిస్ట్స్ కూడా నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. నేను చేసిన ప్రతి సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు. ఈ సినిమాలో నేను చేసిన చైత్ర పాత్ర కూడా విÖ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ: “ట్రైలర్ విÖ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. సినిమాలో ఇంకా ఎక్కువ ఫన్, కామెడీ ఉంటుంది. వరుణ్ తేజ్ గారు, సత్య గారి పెర్ఫార్మెన్స్‌ను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. రీతికా కూడా తన పాత్రను చాలా బాగా చేసింది. మనోజ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. థమన్ గారు అద్భుతమైన రీ`రికార్డింగ్ అందిస్తున్నారు. ఆగస్టు 7న తప్పకుండా థియేటర్‌కు వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను.”

సత్య మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ట్రైలర్ విÖకు నచ్చింది… సినిమా కూడా ఖచ్చితంగా విÖకు నచ్చుతుంది. వరుణ్ తేజ్ గారితో నా కాంబినేషన్, అనంతపురం లోకల్ లాంగ్వేజ్‌లో వచ్చే సన్నివేశాలు అన్నీ చాలా బాగా వచ్చాయి. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. మా దర్శకుడు గాంధీ గారికి, నిర్మాత రాజు రెడ్డి గారికి ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్యూ సో మచ్.”

డీఓపీ మనోజ్ మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. ట్రైలర్ విÖ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అనంతపురం, కొరియాను చాలా అందంగా, అద్భుతంగా ప్రజెంట్ చేశాం. ఇది చాలా మంచి కథ. ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశాం. తప్పకుండా విÖరు థియేటర్‌లో సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.

తారాగణం: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....