దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లిలో మహిళా సదస్సు – నిరసన, వంటావార్పు !
పెద్దపల్లి, సెప్టెంబర్ 04 (ఇయ్యాల తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా మహిళలకు ఇచ్చిన హావిÖలను అమలు చేయకుండా మోసం చేస్తోందని బీఆరఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ చౌరస్తాలో ఆయన ఆధ్వర్యంలో మహిళా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మహిళలంతా కలిసి రోడ్డుపైనే కూరగాయలు తరిగి వంటావార్పు నిర్వహించారు. రెండు గంటల పాటు ఆటపాటలు, బతుకమ్మ పాటలతో పాటు ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాన్ని ఎత్తిచూపే పాటలు పాడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మహిళలకు ఇచ్చిన హావిÖలు ఎక్కడ అమలయ్యాయని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హావిÖలను ఒక్కొక్కటిగా గుర్తుచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెంచుతామని చెప్పిన పెన్షన్లు, విద్యార్థినీలకు స్కూటీలు, కల్యాణలక్క్ష్మి?షాదీముబారక్ మొత్తాన్ని పెంచుతామని చెప్పిన హావిÖలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
మహిళల జీవితాల్లో మార్పు తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు గడిచినా ఇచ్చిన హావిÖలను అమలు చేయకుండా వారిని నిరాశకు గురిచేస్తోందని విమర్శించారు.“ఒక్క నెల ఆగండి.. రూ.4,000 పెన్షన్ ఇస్తాం” అని ఎన్నికల సమయంలో చెప్పిన రేవంత్ రెడ్డి, వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఆ హావిÖని ఎందుకు అమలు చేయలేదని దాసరి మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని గ్యారెంటీ కార్డులు ఇచ్చి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వెయ్యి రోజులు గడిచినా ఒక్కొక్క హావిÖని తప్పించుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.కేసీఆర్ హయాంలో మహిళల సంక్షేమానికి అమలు చేసిన పథకాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఒంటరి మహిళలకు పెన్షన్, బీడీ కార్మికులకు పెన్షన్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలతో మహిళలకు అండగా నిలిచిన ప్రభుత్వం బీఆరఎస్ ప్రభుత్వమేనని అన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి మహిళలు, పిల్లలు, కుటుంబాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి మహిళలను మహారాణులుగా గౌరవించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.విద్యార్థినీలకు స్కూటీలు ఇస్తామని హావిÖ ఇచ్చి, కనీసం సైకిల్ కూడా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దాసరి మనోహర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మహిళలకు ఇచ్చిన ప్రతి హావిÖని అమలు చేసే వరకు బీఆరఎస్ ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.