విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

.రాయచోటి, మే 14 (ఇయ్యాల తెలంగాణ) : జిల్లాలో విద్యాభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపు లక్ష్యంగా  పనిచేయాలని  విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్  కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లోపాఠశాల విద్య,  ఇంటర్మీడియట్ విద్య, సమగ్ర శిక్షా , స్కిల్ డెవలప్మెంట్ మరియు అనుబంధ శాఖల అధికారులతో  సవిÖక్ష సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.రాష్ట్రం లో  ఈ విద్యా సంవత్సరానికి గాను “బడి పిలుస్తోంది”    కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం విద్యార్థుల నమోదు పరంగా జిల్లా ఆరో స్థానంలో ఉన్నదని ,రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన  స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని అన్నారు. రాయచోటి, పీలేరు, మదనపల్లి, వాయల్పాడు, గాలివీడు, పుంగనూరు తదితర ఆరు మండలాల్లో నమోదు  ప్రక్రియ చాలా తక్కువగా ఉందని సంబంధిత  మండలాల అధికారులపై చర్యలు తీసుకోవాలని  జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు.జిల్లాలోని 89 మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 కంటే తక్కువగా ఉన్న నేపథ్యంలో, ఆయా పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల  హాజరు ఇంకా మెరుగుపడేందుకు   చర్యలు తీసుకోవాలని తెలిపారు. పదో తరగతి ఫలితాల విశ్లేషణలో సైన్స్ మరియు తెలుగు సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు గుర్తించి, వారికి ప్రత్యేక రివిÖడియల్ తరగతులు నిర్వహించి అందరూ ఉత్తీర్ణులు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే విద్యాసంవత్సరం మొదటి నుంచే సైన్స్ మరియు తెలుగు సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.జి ఎఫ్ ఎల్ ఎన్  కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ప్రాథమిక చదువు, లెక్కల సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

మార్చిలో నిర్వహించిన ఎండ్‌లైన్ పరీక్షల్లో 898 పాఠశాలలు మంచి ఫలితాలు సాధించాయని, వచ్చే ఏడాదికి కనీసం 75 శాతం పాఠశాలలు ఈ స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. మన బడి మన భవిషత్తు పనులను ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే సకాలంలో పనులు ప్రారంభించి  పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం మరియు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు నిర్వహించాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఫలితాల శాతం  పెంచేందుకు కృషి చేయాలని  అధికారులకు సూచించారు.స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల ద్వారా  ఇప్పటివరకు   శిక్షణ పొంది  ఉద్యోగాలు పొందిన వారి పూర్తి వివరాల  నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిఐఈఓ రవి, డిఈవో సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ  అనురాధ, స్కిల్ డెవలప్మెంట్ అధికారి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.అలాగేరాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆదేశాల మేరకు జిల్లాలో  ఈ నెల 21 నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు డిఆరఓ చంద్రశేఖర్ రెడ్డి  తెలిపారు.

గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం  డిఆరఓ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్  రవి  తో కలిసి  పోలీస్, వైద్య, విద్యుత్, ఆరోగ్య, రవాణా మరియు పోస్టల్ వంటి వివిధ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణపై కీలక సూచనలు జారీ చేశారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం 41 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించబడతాయనీ, ఈ నెల 21  నుండి పరీక్షలు ప్రారంభమవుతాయనీ తెలిపారు.ఉదయం సెషన్: 9.00  నుండి 12.00 గంటల  వరకు మధ్యాహ్నం సెషన్: 2.00 నుండి 5.00  వరకు జరుగుతాయన్నారు.మొదటి సంవత్సర పరీక్షలకు 9274 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 5558 మంది వోకేషనల్  1125 మంది మొత్తం 15957 మంది హాజరవుతారని చెప్పారు. మొత్తం 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా  పరీక్ష కేంద్రాల్లో అనుమతించబడదని, అలాగే విద్యార్థులు ఎలాంటి సెల్ ఫోన్లు, ఎలక్టానిక్    వస్తువులు, పరీక్ష కేంద్రంలో అనుమతించారని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో అవసరమైన లైట్లు,ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.  ప్రతి ఒక్క పరీక్షా కేంద్రం వద్ద  సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని,  పరీక్ష  కేంద్రాల్లో ఏదైనా సమస్య వస్తే వెంటనే తెలియజేయుటకు  కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కంట్రోల్ రూమ్ నెంబర్ 9866112750 కు తెలియజేయవచ్చునని తెలిపారు.పరీక్షా కేంద్రాలవద్ద 163 సెక్షన్ విధించాలని, పరీక్షలు నిర్వహించే  పరిసర ప్రాంతాలలో జిరాక్స్ షాపులను మÖసివేయాలని చెప్పారు. విద్యార్ధులు ఇబ్బంది పడకుండా త్రాగునీరు, మరుగుదొడ్లు లాంటి మౌలిక వసతులను కల్పించాలని, పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేందుకు వీలుగా ఆర్‌టిసి బస్సులను నడపాలని చెప్పారు. పరీక్ష నిర్వహించే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, పారిశుధ్యం, త్రాగునీటి వసతులు, పరిశుద్ధ పనుల ను పంచాయితీశాఖ, మున్సిపాల్టీలు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. కేంద్రాలవద్ద పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని చెప్పారు. 

పరీక్షా సమయంలో  దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు.ప్రతీ పరీక్షా కేంద్రంవద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఓ ఆర్ ఎస్ పాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు తెలిపారు . ప్రతీ కేంద్రంవద్దా సిట్టింగ్ స్క్వాడ్ తోపాటు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ విÖడియట్ పరీక్షలకు సంబంధించిన విద్య, పోలీస్, రవాణా, విద్యుత్తు, వైద్య, పోస్టల్,  మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్, లేబర్, పోస్టల్  తదితర శాఖలు పరీక్షలు అత్యంత పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని డిఆరఓ  స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్షల నిర్వహణ కమిటి మరియు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి రవి, డీఈవో సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ శ్రీమతి అనురాధ, మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రవిÖల, మున్సిపల్ శాఖ డి వై ఈఈ పి శ్రావణి, సర్వ శిక్ష అభియాన్ అధికారిని డిపిఎమఓ  రమేష్ బాబు, ఆర్టీసీ డిఎం ఎం. వి. ఆర్. రెడ్డి, ఇన్స్పెక్టర్ రామాంజనేయులు, పోస్టల్ అధికారిని  సునంద,విద్యుత్ శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....