ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్
హైదరాబాద్, ఆగస్టు 12, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే విధానం ఆగస్టు 18 నుంచి అమలు లోకి కానుందని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ అన్నారు. బుధవారం అయన విÖడియాతో మాట్లాడుతూ హెచ్ సిటీ తిబిy ప్రాజెక్ట్ పనుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకే వన్వే. ఇప్పటికే రెండుసార్లు పైలట్ ట్రయల్స్ నిర్వహించామని అన్నారు. ఏప్రిల్ 5, జూన్ 21న పైలట్ ట్రయల్స్ నిర్వహణ జరిగింది. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్లు,సైన్ బోర్డులు వుంచాం. నాలుగు షిఫ్ట్లలో ట్రాఫిక్ సిబ్బంది మోహరింపు వుంటుంది. సిసిటీవీలతో 24 గంటలూ ట్రాఫిక్పై నిఘా వుంటుంది. డ్రోన్లతో రియల్టైమ్ ట్రాఫిక్ మానిటరింగ్ చేస్తామని అన్నారు. గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ రూట్లలోనూ మార్పులు చేసాం. దాదాపు రెండేళ్ల పాటు వన్వే విధానం అమలు లొ వుంటుంది. రాంగ్సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు వుంటాయి. కొత్త ట్రాఫిక్ విధానానికి వాహనదారులు సహకరించాలని అన్నారు.