జనగణన ప్రక్రియను పరిశీలించిన Charminar ZC సత్యనారాయణ

హైదరాబాద్, మే 14 (ఇయ్యాల తెలంగాణ) :  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ యంసీ ) చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ కే.సత్యనారాయణ అధికారులతో కలసి గురువారం మధ్యాహ్నం చార్మినార్ సర్కిల్ పరిధిలోని ఛత్రినాక, చాంద్రాయణగుట్ట. మొఘల్​పురా, ఉప్పుగూడ ప్రాంతాల్లో కొనసాగుతున్న జనగణన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే విధానాన్ని పరిశీలించి ఎన్యూమరేటర్లతో సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ వివరాలను  నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా జోనల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఏనుమరేటర్లు జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతి ఇంటిని సందర్శించి పూర్తి వివరాలు సేకరించాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు తమ ఇంటి వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు సహకరించి సరైన సమాచారం అందించాలని కోరారు. జనగణన ప్రక్రియ సందర్భంగా ప్రత్యేక విధులు  నిర్వహిస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు స్థానిక ప్రాంతాల్లో పర్యటిస్తూ సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఈ పర్యటనలో చార్మినార్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరిత, అధికారులు, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు,  సిబ్బంది పాల్గొన్నారు.


iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....