కొండా సురేఖ భర్తరఫ్ బాధ కలిగించింది : DK ఆరుణ

హైదరాబాద్, సెప్టెంబర్ 04 (ఇయ్యాల తెలంగాణ) : కొండా సురేఖ బర్తరఫ్ పై  ఎంపీ డీకే అరుణ స్పందించారు. కొండా సురేఖ సీనియర్ మహిళా నాయకురాలు. కాంగ్రెస్ లోని ఇంటర్నల్ రాజకీయ విభేదాలు ఆమె ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కి దారి తీసాయని భావిస్తున్నాను..రాజకీయాల్లో అనేక గ్రూపులు తగాదాలు ఉంటాయి.. కాంగ్రెస్ లో అవి రోజు చూస్తున్నాం. కొండా సురేఖ సీనియర్ నాయకురాలు, 2009 లో ఆమె నేను మంత్రులుగా కలసి పని చేశాం. నా తోటి ఒక మహిళ నాయకురాలు మంత్రిగా తెలంగాణ కు సేవలు అందిస్తున్నారని సంతోషపడ్డాం. ఆమెను బర్తరఫ్ చేయడం నిజంగా బాధకలిగించింది. బీసీలకు కాంగ్రెస్ పార్టీ,సీఎం ఎంతో చేశామని గొప్పలు చెప్పుకుంటారు. తాను బీసీ మహిళా. తన కూతురు ఏదో మాట్లాడిందని సురేఖ విÖద యాక్షన్ తీసుకోవడం సరికాదు, సమర్ధనీయం కాదు. ఒక మహిళ రాజకీయాల్లో కష్టనష్టాలను ఎదుర్కొని నిలబడటం, ఇంతవరకు రావడమనేది గొప్ప విషయం.  మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం సమర్ధనీయం కాదు. ఇప్పటివరకు బీజేపీలోకి ఆహ్వానించే అటువంటి చర్చలు ఏవీ జరగలేదన అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....