మతాలు వేరైనా మనసులు ఒక్కటే !

కృష్ణాష్టమి వేడుకల్లో ముస్లిం పిల్లలు

పిడుగురాళ్ల, సెప్టెంబర్ 03 (ఇయ్యాల తెలంగాణ) :  :పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని మాంటెస్సోరి ఇంగ్లీష్ విÖడియం స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధా గోపికల వేషధారణల్లో అలరించారు. అయితే ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ముస్లిం కుటుంబాలకు చెందిన చిన్నారులు సైతం కృష్ణుడు, రాధ వేషాలు ధరించి వేడుకల్లో పాల్గొనడం విశేషం. మతాలు వేరైనా, మనసులు ఒక్కటేనని, పండుగలు వేరైనా, ఆనందం అందరిదీ ఒకటేనని ఈ చిన్నారులు చాటి చెప్పారు. ఒకరి పండుగను మరొకరు గౌరవిస్తూ, సంస్కృతులను పంచుకుంటూ, ప్రేమతో కలిసి జరుపుకోవడమే నిజమైన భారతీయత అని చిన్నారులు చాటిచెప్పారు. చిన్నారుల వేషధారణ చూసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే మత సామరస్యం, సోదరభావం, పరస్పర గౌరవం వంటి విలువలను పిల్లల్లో పెంపొందించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. మతం మనిషిని విడదీయకూడదు అని, మనసులు కలపాలి దృశ్య రూపంలో చిన్నారులు తెలిపారు. పండుగ ఎవరిదైనా, ఆనందం అందరిదీ అన్నారు.ఇదే నిజమైన భిన్నత్వంలో ఏకత్వం, ఇదే భారతీయత అని చిన్నారులు వ్యక్తం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....