మహిళను మోసం చేసిన SI అరెస్టు

హైదరాబాద్, ఆగస్టు 01 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణలో మహిళలను వేధిస్తున్న పోలీసుల జాబితలో మరో ఎస్సై పేరు చేరింది. మహిళలపై లైంగిక దాడి కేసులో ఎస్సై శ్రీకాంత్ అరెస్ట్ అయ్యాడు. సోషల్ విÖడియాలో పరిచయాలు పెంచుకొని మహిళలను మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి చేసినట్లు కేసు నమోదయింది. హైదరాబాద్ యువతి ఫిర్యాదుతో జగిత్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు. సాంకేతిక ఆధారాలతో నిజామాబాద్లో పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఎస్సై శ్రీకాంత్ను అరెస్ట్ చేసి హనుమకొండకు తరలించారు. నిందితుడు సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎస్సైగా గుర్తించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....