చంపాపేట్లో అమ్మవారి గుడిలో విగ్రహం మాయం

హైదరాబాద్, ఆగస్టు 21 (ఇయ్యాల తెలంగాణ) : చంపాపేట్లోని కటికొనుకుంట ప్రాంతంలో అమ్మవారి ఆలయంలో విగ్రహం మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం కనిపించకపోవడంతో ఆలయ నిర్వాహకులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. విగ్రహం ఎలా మాయమైంది? ఎవరైనా అపహరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఆలయం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....