PM మోడీ “మన్ కీ బాత్” ప్రతి ఒక్కరికీ ప్రేరణ కలిగిస్తుంది : BJP

హైదరాబాద్, జూలై 26 (ఇయ్యాల తెలంగాణ) : బీజేపీ నాయకులు శక్తి కేంద్ర ప్రముఖ్ భాను ప్రకాష్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీజీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు సుధాకర్ శర్మ గారి నివాసంలో వీక్షించారు. గౌలిపుర డివిజన్ లో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమ వీక్షణ  కార్యక్రమం ముఖ్య అథితిగా సుధాకర్ శర్మ కొనసాగారు. మోడీ ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి ఒక్కరికీ ప్రేరణ కలిగిస్తున్నదని బీజేపీ నాయకులు అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కౌడి సురేందర్ బీజేపీ డివిజన్ అధ్యక్షులు ఇ. సుమన్ కుమార్, జమాల్ పూర్ చంద్ర శేఖర్ డొంకి యాదగిరి, జమాల్ పూర్ అశోక్, ఎం. వెంకటేష్ , కె. ప్రేమ్ రాజ్, పోలింగ్ బూత్ ఇంచార్జి రవి కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు.    

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....