GHMC ఆధ్వర్యంలోGolconda శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనం సమర్పణ

హైదరాబాద్, జూలై 26 (ఇయ్యాల తెలంగాణ) : జిహెచ్ఎంసి గోల్కొండ సర్కిల్ పరిధిలోని గోల్కొండ వార్డు కార్యాలయం ఆధ్వర్యంలో గోల్కొండలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనం సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. కన్నుల పండుగగా బోనాల సమర్పణ కొనసాగింది.  గోల్కొండ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ మార్గదర్శకత్వంలో శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనం సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.  గోల్కొండ వార్డు కార్యాలయం తరఫున జోగిని భవాని నెత్తిన బోనం ఎత్తుకొని నృత్యాలు చేస్తూ బోనం సమర్పించారు. దారి పొడవునా  పోతరాజులతో కలిసి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పణ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. 

ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు, వివిధ సర్కిల్ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల పండుగను జయప్రదం చేశారు. గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆశీస్సులు పొంది అందరూ సుఖ శాంతులతో ఎల్లప్పుడూ  ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు, సంతోషాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడు కున్నట్లు పేర్కొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....