హైదరాబాద్, జూలై 20 (ఇయ్యాల తెలంగాణ) : బీజేపీ చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సుల్తాన్ షాహి (హరిబౌలి డివిజన్)లో బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. కుమార్ ఆధ్వర్యంలో ‘సర్’ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయబడింది. ఈ సందర్బంగా ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారమ్‌లను నింపడంలో సహాయం అందించడంతో పాటు, ఆయా ఫారమ్‌లను నిర్ణీత సమయంలో సంబంధిత బూత్ లెవెల్ ఆఫిసర్ (బిఎల్ఓ) లకు సమర్పించాలని ఓటర్లకు సూచించారు. సర్ ప్రక్రియకు సమయం కూడా చాలా తక్కువగా ఉన్నాదని ఓటర్లు త్వరగా సంబంధిత బిఎల్ఓల దగ్గర పూర్తి వివరాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బి. కరంజయ,సునీల్ తివారీ,యు. రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- Charminar Zone
- BJP సీనియర్ నాయకుడు M. Kumar ఆధ్వర్యంలో ‘SIR’ హెల్ప్ డెస్క్
BJP సీనియర్ నాయకుడు M. Kumar ఆధ్వర్యంలో ‘SIR’ హెల్ప్ డెస్క్
Leave a Comment