July 27 న గౌలిపుర ఆరెకటిక సంఘం ఎన్నికలు

హైదరాబాద్, జూలై 22 (ఇయ్యాల తెలంగాణ) : పాతబస్తీ గౌలిపురలోని ఆరెకటిక సంఘం ఎన్నికలు జూలై 27 న జరగనున్నాయి.తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ఎన్నికలను నిర్వహించనున్నారు. మంగళవారం ఎన్నికల నామినేషన్ కు చివరిరోజు కావడంతో సహకార సంఘం డైరెక్టర్ పోస్ట్ కు జమాల్ పూర్ అశోక్ నామినేషన్ వేయడం జరిగింది. సహకార సంఘం అధికారి నాగిరెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు యశ్వంత్ రావు, ఎం రమేష్, జె బాబురావు, పి రఘురాం, అంబాదాస్, జె సురేందర్, ఎన్ మారుతీ రావు బి రాజేష్, ఏ రవీందర్, కే సురేష్ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....