చాగలమర్రి .. అంగన్వాడీలకు మండల స్థాయి శిక్షణ శిక్షణ ఇస్తున్న డాక్టర్ ప్రత్యూష
ఆళ్లగడ్డ , జూన్ 6 (ఇయ్యాల తెలంగాణ) : ఆళ్లగడ్డ ప్రాజెక్టు పరిధిలోని చాగలమర్రి మండలంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ సుశీల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఏఐ ఆధారిత ఈ సి డి స్కీనింగ్ పై మండల స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణలో డాక్టర్ ప్రత్యూష పలు సూచనలు ఇచ్చారు. 0`6 ఏళ్ల పిల్లల్లో వయసుకు తగిన వృద్ధి లేని పిల్లలను గుర్తించి నవ చైతన్య యాప్ ద్వారా ఏఐ ఆధారిత ఈసిడి స్కీనింగ్ చేయాలని అంగన్వాడి టీచర్లకు తెలియజేశారు. చిన్నారుల్లో అభివృద్ధి సంబంధిత సమస్యలు, వైకల్యాలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించే విధానంపై అవగాహన కల్పించారు.0`6 వయసుగల పిల్లల బర్త్ డిఫెక్ట్స్, వృద్ధిలో లోపాలు గుర్తించి నమోదు చేయాలని తెలిపారు. భాషా బుద్ధి వికాసం, సామాజిక భావోద్వేగా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి పిల్లల వయసుకు తగిన అభివృద్ధిని పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సుశీల, హెల్త్ ఎడ్యుకేటర్ విజయభారతి, వివిధ అంగన్వాడి కేంద్రాల అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.