హైదరాబాద్, మే 18 (ఇయ్యాల తెలంగాణ) : శిక్షణలో వున్న 2025 బ్యాచ్ ఐఏస్ అదికారులు బుధవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. ట్రైనీ ఐఏఎస్ లు ఈట్టబోయిన సాయి శివాణీ, సచిన్ బసవరాజ్ గుట్టూరు, పోతరాజు హరి ప్రసాద్,పరాస్ కుమార్, పి సురేష్, నేలతూరు శ్రీకాంత్ రెడ్డిలు సీఎం ను కలిసారు. ఈ కార్యక్రమంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ ఛైర్ పర్సన్ శాంతి కుమారి, కోర్సు డైరెక్టర్ కందుకూరి ఉషారాణి తదితరులు వున్నారు.