న్యూఢిల్లీ, మే 18 (ఇయ్యాల తెలంగాణ) : జనగణనలో కుల గణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. వెనుకబడిన వర్గాలకు సంక్షేమ చర్యలు తీసుకోవాలంటే వారి సంఖ్య ప్రభుత్వానికి తెలియాలని సీజేఐ జస్టీస్ సుర్యాకాంత్ వ్యాఖ్యానించారు. వెనుకబడిన కులాల సంఖ్య ప్రభుత్వానికి తెలియాలి. కుల గణన విషయం అన్నది విధానపరమైన నిర్ణయం.. ఇందులో కోర్టు జోక్యం చేసుకోదని కోర్టు వ్యాఖ్యానించింది. కుల డేటా దుర్వినియోగం అవుతుందని పిటిషనర్ వాదనను తోసిపుచ్చిన సుప్రీం, కులం ఆధారిత సెన్సస్కు అడ్డు చెప్పేదేవిÖ లేదని స్పష్టం చేసింది.