తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సెప్టెంబరు 15న సజావుగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్ పేపర్`1 పరీక్షకు 84.12 శాతం, మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ `2 పరీక్షకు 91.11 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంలో కఠినంగా వచ్చే పేపర్`1 ప్రశ్నపత్రం ఈసారి సులభంగా వచ్చింది. పేపర్`2 మాత్రం కఠినంగా ఇచ్చారు. దీనిలో కొన్ని ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నాయి. టెట్ పేపర్`1 పరీక్షకు 2,69,557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,26,744 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పేపర్`2 పరీక్షకు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ ప్రాథమిక కీని మూడు, నాలుగు రోజుల్లో వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. తాజా సమాచారం ప్రకారం వినాయక చవతి తర్వాతే కీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తొలుత అభ్యంతరాలు స్వీకరించి, తుది కీ ప్రకటించనున్నారు. అయితే అక్కడక్కడ ఓఎమ్మార్ షీట్ల పంపిణీలో తప్పిదాలు జరిగాయి.ఈ పరీక్షల ఫలితాలు ఈ నెల 27న విడుదలకానున్నాయి. ఇదిలా ఉండగా, సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు కొన్నిచోట్ల ఒక పేపర్‌కు బదులు మరో పేపర్.. ఒక అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి ఓఎమ్మార్‌ను పంపిణీ చేయడం, ఆ తర్వాత తప్పిదాలు జరిగినట్టుగా గుర్తించడంతో వైట్నర్తో చెరిపివేశారు. వైట్నర్ వాడిన ఓఎమ్మార్ షీట్లు చెల్లుబాటవుతాయని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
- Homepage
- Telangana News
- TET Results 27న
TET Results 27న
Leave a Comment
Related Post