గచ్చిబౌలి Police Station పరిధిలో భారీ చోరీ

హైదరాబాద్, జూన్  9 (ఇయ్యాల తెలంగాణ) : గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లా లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త ఇంట్లో సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు వజ్రాలను  నేపాల్ గ్యాంగ్ ఎత్తుకెళ్లింది. ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన భార్యాభర్తలు ప్రధాన అనుమానితులుగా పోలీసులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితమే వ్యాపారవెత్త వీరిని పనిలో పెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి,ఆదివారం తిరిగి వచ్చేసరికి  నేపాలీ దంపతులు మాయం అయ్యారు, ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని  వ్యాపార వేత్త భావించారు. పూజా గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు సిసిటివి (అఅTV) ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు,నిందితుల కోసం గాలిస్తోన్నాయి. . 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....