శ్రీకాకుళం జిల్లా, జూన్ 6 (ఇయ్యాల తెలంగాణ) : బిర్యానీ విషయంలో ఫోన్‌లో జరిగిన వాగ్వాదం దంపతుల ప్రాణాలు బలితీసుకుంది. కళింగపట్నానికి చెందిన బలరాం(33), ప్రియాంక(27) విశాఖ శ్రీనగర్‌లో నివసిస్తున్నారు. ఆదివారం మద్యం తాగడానికి బయటకు వెళ్లిన భర్త బలరాం, భార్యకు ఫోన్ చేసి బిర్యానీ తెచ్చి ఉంచాలని కోరాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రియాంక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన బలరాం ఆమె మృతదేహాన్ని చూసి భయంతో తన నాలుగేళ్ల కుమారుడి కళ్లెదుటే అదే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.