మేడ్చల్, జూన్ 9 (ఇయ్యాల తెలంగాణ) : ఉప్పల్ పిఎస్ పరిధిలోని రామంతాపూర్లో దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.4,000 నగదు, నేరానికి ఉపయోగించిన యాక్టివా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూన్ 7 అర్ధరాత్రి 1 గంట సమయంలో (తెల్లవారితే జూన్ 8) లక్క్ష్మీనారాయణ కాలనీకి చెందిన చంద్రశేఖర్ తన స్నేహితులతో కలిసి పెట్రోల్ కోసం వెళ్తుండగా మోడ్రన్ బేకరీ సవిÖపంలో నిందితులు దాడి చేసి శివకాంత్ వద్ద ఉన్న రూ.4,000 నగదును లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనలో చంద్రశేఖర్ తలకు గాయమైంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేపట్టి రామంతాపూర్ డీ`మార్ట్ సవిÖపంలో నిందితులను పట్టుకున్నారు. విచారణలో రాత్రివేళ ఒంటరిగా వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నట్లు తేలింది. అరెస్టైన నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. కేసులో ఉన్న బాలుడిని సీసీఎల్ హోంకు తరలించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు.