Car ను “ఢీ” కొట్టిన DCM ? ప్రయాణికులు క్షేమం !

రంగారెడ్డి, జూన్  9 (ఇయ్యాల తెలంగాణ) :రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహాలక్క్ష్మి టిఫిన్ సెంటర్ ఎదురుగా డీసీఎం`కార్ ఢీ కొన్నాయి.  ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి డీజీఎం ఢీకొట్టింది. ప్రమాదంతో కారు డివైడర్ పైకెక్కింది.  ఘటనతో రోడ్డుపై  ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  ట్రాఫిక్ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక అంచనా.  ప్రమాదంలో ప్రాణనష్టం లేదని సమాచారం.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....