హైదరాబాద్, జూన్ 9 (ఇయ్యాల తెలంగాణ) : గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లా లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త ఇంట్లో సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు వజ్రాలను నేపాల్ గ్యాంగ్ ఎత్తుకెళ్లింది. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన భార్యాభర్తలు ప్రధాన అనుమానితులుగా పోలీసులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితమే వ్యాపారవెత్త వీరిని పనిలో పెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి,ఆదివారం తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు మాయం అయ్యారు, ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని వ్యాపార వేత్త భావించారు. పూజా గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు సిసిటివి (అఅTV) ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు,నిందితుల కోసం గాలిస్తోన్నాయి. .
