ధరణి అక్రమాలపై ఉక్కుపాదం

👉 అక్రమాల బట్టబయలుకు ఫాస్ట్‌ట్రాక్ విచారణ

👉 పేదల భూములు కాజేసిన వారిని వదిలిపెట్టం

👉 నిషేధిత జాబితాలో కొత్తగా అంగుళం భూమి కూడా చేర్చలేదు

👉 భూముల ధరల సవరణతో స్టాంప్స్ & రిజిస్టేషన్ల ఆదాయం 20% వరకు పెరుగుదల

👉 త్వరలో అసైన్డ్ భూములపై సమగ్ర విధాన నిర్ణయం

👉 కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లులు చెల్లిస్తాం

హైదరాబాద్, ఆగస్టు 01 (ఇయ్యాల తెలంగాణ) :  ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని పేదల భూములు, ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసిన వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  స్పష్టం చేశారు. ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని ఫాస్ట్‌ట్రాక్ విధానంలో విచారిస్తున్నామని, అక్రమాలకు పాల్పడిన వారెవరైనా చట్టం ముందు నిలబెట్టడం ఖాయమని హెచ్చరించారు.శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విÖడియా ప్రతినిధులతో మంత్రి  మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను అడ్డుగా చేసుకుని భారీ స్థాయిలో భూ అక్రమాలు, అక్రమ మ్యుటేషన్లు, ప్రభుత్వ భూముల బదిలీలు జరిగాయని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....