హైదరాబాద్, మే 16 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వర్కాల సత్యనారాయణ దంపతులు తమ 32వ పెళ్లిరోజు వేడుకలను సకుటుంబ సమేతంగా గోవాలో జరుపుకున్నారు. అత్యంత ఉత్సాహంగా ఆహ్లాద కరమైన వాతావరణంలో ఏంతో వైభవోపేతంగా పెళ్లిరోజు వేడుకలను జరుపుకోవడం ఆనందదాయకంగా ఉన్నదని దంపతులిరువురు కొనియాడారు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీ సభ్యులు పులి శివ తన సతీమణి మంజులతో కలసి వర్కాల అనిత, సత్యనారాయణలను శాలువాతో సన్మానించి అభినందనలు అందించారు. భవిష్యత్తులో ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆశాభవం వ్యక్తం చేశారు.అత్యంత ఉత్సాహంగా అనిత, సత్యనారాయణ దంపతులు తమ పెళ్లి రోజు వేడుకలతో ఆనందంగా కొనసాగించారు. ఒకరికొకరు కలకాలం శాశ్వత బంధాన్ని కొనసాగించాలని గోవాలో కలసి అనేక అడుగులతో ముందుకు నడిచారు.
- Homepage
- iyyala telangana
- GOA లో వర్కాల సత్యనారాయణ దంపతుల పెళ్లిరోజు వేడుకలు
GOA లో వర్కాల సత్యనారాయణ దంపతుల పెళ్లిరోజు వేడుకలు
Leave a Comment