Amazon ప్రైమ్‌లో దూసుకుపోతోన్న Movie ‘బరాబర్ ప్రేమిస్తా’

సినిమా ప్రతినిధి, మే 09 (ఇయ్యాల తెలంగాణ) : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన రీసెంట్ హిట్ సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంతో వచ్చిన ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ కథానాయికగా నటించారు. అర్జున్ మహీ (’ఇష్టంగా’ ఫేమ్) విలన్‌గా మెప్పించారు. ‘బారాబర్ ప్రేమిస్తా’ మÖవీని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మÖవీ వండర్స్ సంస్థల విÖద గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మించారు. ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

థియేటర్లో మంచి హిట్ దక్కించుకున్న తరువాత రీసెంట్‌గానే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ‘బరాబర్ ప్రేమిస్తా’ సక్సెస్ ఫుల్‌గా స్టీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ‘బరాబర్ ప్రేమిస్తా’ అమెజాన్‌లో టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. చంద్రహాస్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌కి మంచి స్పందన వస్తోంది.

ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, లక్క్ష్మణ్ విÖసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.  ఈ మÖవీకి కథని ఎంఏ తిరుపతి, మాటలు రమేష్ రాయ్ అందించారు. వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా,  ఆరఆర్ ద్రువన్ సంగీత దర్శకుడిగా పని చేశారు,  బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....