రంగారెడ్డి, జూన్ 9 (ఇయ్యాల తెలంగాణ) :రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహాలక్క్ష్మి టిఫిన్ సెంటర్ ఎదురుగా డీసీఎం`కార్ ఢీ కొన్నాయి. ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి డీజీఎం ఢీకొట్టింది. ప్రమాదంతో కారు డివైడర్ పైకెక్కింది. ఘటనతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక అంచనా. ప్రమాదంలో ప్రాణనష్టం లేదని సమాచారం.
