Tollywood లో Hollywood మేకింగ్‌ తో ‘ది మానిటి.ఇన’ Movie

సినిమా ప్రతినిధి, మే 09 (ఇయ్యాల తెలంగాణ) : టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన ‘ది మానిటి.ఇన’ చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. డైరెక్టర్ బీఎస్ రావు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త విజువల్ వండర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. కేవలం వందల కోట్లను మాత్రమే కాకుండా, వేల కోట్ల వసూళ్లను టార్గెట్ చేసుకుని ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఉండబోయే ఈ సినిమా, తెలుగు సినిమా మేకింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తుందని చిత్ర దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీఎఫఎక్స్ విభాగంలో అనుభవం ఉండడంతో టాలీవుడ్‌లో మొట్టమొదటిసారిగా ఈ చిత్రాన్ని ఎఓంచీ8ఐ ఫార్మాట్‌లో రూపొందించాలని నిర్ణయించుకున్నారు.

సాధారణంగా హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ ఫార్మాట్‌ను ఇక్కడ పరిచయం చేయడం ద్వారా ప్రేక్షకులకు ఒక వినూత్నమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారు. టెక్నాలజీ పరంగా రాజీ పడకుండా, ప్రతి ఫ్రేమ్‌ను ఒక విజువల్ పోయెట్రీలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ చిత్ర కాన్సెప్ట్ గురించి దర్శకుడు బీఎస్ రావు మాట్లాడుతూ, మానవత్వం (ఊబీఎజీనితిబిy) విఫలమైనప్పుడు ‘మానిటీ’ (ఓంఔఎTజ) ఏం చేస్తుంది అనే ఒక విలక్షణమైన పాయింట్‌తో ఈ కథ సాగుతుందని వివరించారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండు అదిరిపోయే పోస్టర్లను విడుదల చేశారు. అందులోని ఓ పోస్టర్‌లో “చిష్ట్రవని ష్ట్రబీఎజీనితిబిy తిబ నివణశ్రీవఞబివట… ఓజీనితిబిy జీతీతిబవబ” అనే ట్యాగ్‌లైన్ సినిమా ప్రధాన ఇతివృత్తాన్ని ఆసక్తికరంగా రివీల్ చేస్తోంది. 

సమాజంలో మనిషి విలువలు తగ్గినప్పుడు ప్రకృతి లేదా ఒక అదృశ్య శక్తి ఏ విధంగా స్పందిస్తుందనే అంశాన్ని సైన్స్ ఫిక్షన్, సోషల్ ఎలిమెంట్స్ కలగలిపి అద్భుతంగా రాసుకున్నట్లు తెలిపారు. ఈ పాయింట్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేయడమే కాకుండా, సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని ఆయన వెల్లడించారు. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి సైతం ఐమాక్స్ ఫార్మాట్‌లో సినిమా చేయడానికి ఎంతో సమయం తీసుకున్నారని, తాను తన మొదటి సినిమాతోనే ఎఓంచీ 8ఐ ప్రమాణాలను అందుకోవాలని గట్టి సంకల్పంతో ఉన్నానని బీఎస్ రావు ధీమా వ్యక్తం చేశారు. పోస్టర్ పై కనిపిస్తున్న “ఎఓంచీ 8k నివలవతీ bవfనీతీవ” అనే పదం ఈ చిత్ర సాంకేతిక నాణ్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. మనిషి సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదని, తనకున్న టెక్నికల్ నాలెడ్జ్‌తో హాలీవుడ్ స్థాయి అవుట్‌పుట్‌ను టాలీవుడ్ హీరోలతో సాధ్యం చేసి చూపిస్తానని ఆయన ఛాలెంజ్ చేశారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, తెరపై కనిపిస్తుందని ఆయన గర్వంగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదించినట్లు దర్శకుడు తెలిపారు. స్కిప్ట్ డిమాండ్ మేరకు ఎవరైనా ఈజీగా సెట్ అయ్యేలా కథను సిద్ధం చేశానని, స్టార్ హీరోల డేట్స్ కుదిరితే ఈ పాటికి సినిమా ప్రారంభమయ్యేదని బీఎస్ రావు పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ నచ్చే ఏ హీరో అయినా ముందుకు వస్తే వారితో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఈ కథలో ఉండే ఎమోషన్స్, విజువల్స్ ఏ స్టార్ హీరోకైనా ఒక కెరీర్ మైల్‌స్టోన్ లాంటి సినిమా అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పోస్టర్‌లో కనిపిస్తున్న ఇంటెన్స్ ఐస్ (కళ్లు) సినిమాలోని గాంభీర్యాన్ని, నిగూఢమైన రహస్యాలను సూచిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ సోషల్ విÖడియాలో విపరీతమైన రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఈ లుక్‌లో అంతరిక్షం (Sజూజీఞవ), నగరం (అతిబిyబఞజీజూవ), అడవి (ఈనీతీవబబి) సముద్రం (Sవజీ) వంటి విభిన్న ఎలిమెంట్స్ ఒకే చోట కనిపించడం సినిమా విస్తృతిని చాటిచెబుతోంది. ప్రేక్షకులు తమ ఊహలకు కూడా అందని స్థాయిలో ఈ సినిమా విజువల్స్ ఉంటాయని, విÖరు ఎంతటి భారీ అంచనాలు పెట్టుకున్నా వాటిని మించేలా అవుట్‌పుట్ ఉంటుందని చిత్ర యÖనిట్ హావిÖ ఇస్తోంది. ముఖ్యంగా యÖత్ మరియు పిల్లలు ఈ సినిమాలోని విజువల్స్, క్యారెక్టరైజేషన్స్‌కు ఫిదా అవుతారని, ఇక పిల్లలు ఇష్టపడే ఏ సినిమా అయినా సరే అది ఒక యÖనివర్సల్ హిట్‌గా మారుతుంది ఖచ్చితంగా. సినిమా మార్కెట్ పరంగా చూస్తే, ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల వ్యాపారం చేసే సత్తా ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం తెలుగు రాష్టాలకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.


కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మేకింగ్ లో క్వాలిటీ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే నమ్మకంతో దర్శకనిర్మాత బీఎస్ రావు ఉన్నారు. పోస్టర్ డిజైన్ లోని రిచ్‌నెస్ ఈ సినిమా గ్లోబల్ అప్పీల్‌ను ప్రతిబింబిస్తోంది.  ఈ ప్రాజెక్టులో భాగమయ్యే టెక్నీషియన్లు, నటీనటులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. హాలీవుడ్ టెక్నీషియన్లతో సమానంగా ఇక్కడి వారు కూడా ప్రతిభ చూపేలా వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా క్రెడిట్స్ లో పేరు ఉండటం అనేది భవిష్యత్తులో ఒక గొప్ప గౌరవంగా నిలిచిపోతుందని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని కోరుకునే ఎవరైనా ఈ భారీ చిత్రంలో భాగం కావచ్చునని మేకర్స్ పిలుపునిచ్చారు. పోస్టర్ ఎగువ భాగంలో కనిపిస్తున్న కాస్మిక్ విజువల్స్ ఈ చిత్రం ఒక ఎపిక్ విజువల్ స్పెక్టాకిల్ కాబోతోందని స్పష్టం చేస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత టాలీవుడ్ పేరును ప్రపంచస్థాయిలో నిలబెట్టే సత్తా ఉన్న ప్రాజెక్టుగా ‘ది మానిటి.ఇన’ అభివర్ణించబడుతోంది. తెలుగు వారు గర్వపడేలా, తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించేలా ఈ సినిమా ఉండబోతోంది. విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో ఉన్న తన పట్టును ఉపయోగించి, అతి తక్కువ సమయంలోనే ఈ అద్భుతాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో దర్శకుడు బీఎస్ రావు పనిచేస్తున్నారు. పోస్టర్ దిగువన ఎరుపు రంగు అడవిలో పరిగెడుతున్న ఒక అమ్మాయిని చూస్తుంటే చాలా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తానని బీఎస్ రావు వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, షూటింగ్ ప్రారంభానికి ముందే అన్ని రకాల టెక్నికల్ టెస్టులు పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు. టాలీవుడ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....