బద్వేలు జులై 5, (ఇయ్యాల తెలంగాణ ):బద్వేల్ కు సవిూపంలోని లంక మల్ల అభయారణ్యంలో ఎకో టూరిజం ఏర్పాటుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు లంక మల్లేశ్వర స్వామి గుడి పరిసరాల్లో ఏకో టూరిజం ఏర్పాటుకు తల సేకరణ చేయాలని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వేటర్ మధుసూదన్ రెడ్డి జిల్లా జిల్లా ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా రెడ్డి బావి బేస్ క్యాంపును ఆయన పరిశీలించారు ఎర్రచందనం పరిరక్షణపై ఆరా తీశారు సిబ్బంది చేపట్టవలసిన చర్యలపై ఆయన తగు సూచనలు చేశారు కొండూరు అటవీ పరిధిలోని శ్రీ లంక మల్లేశ్వర స్వామి గుడిని ఆయన సందర్శించారు అక్కడ వృక్ష సంపద చెట్లను వాతావరణం అక్కడి పరిస్థితులను ఆయన పరిశీలించారు అనంతరం ఎకో టూరిజం ఏర్పాటు కోసం అవసరమైన స్థలాలను ఆయన పరిశీలించారు చేపట్టవలసిన పనులపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా అటవీశాఖ అధికారి సందీప్ రెడ్డి జిల్లా సామాజిక అటవీశాఖ అధికారి నాగార్జున రెడ్డి ప్రొద్దుటూరు సబ్ డివిజన్ అధికారి దివాకర్ బద్వేలు సిద్ధవటం ప్రొద్దుటూరు ఒంటిమిట్ట అటవీశాఖ అధికారులువెంకట శేషయ్య కళావతి హేమాంజలి ప్రణీత సెక్షన్ అధికారులు బీటు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు
- Homepage
- Telangana News
- లంక మల్ల అభయారణ్యంలో ఏకో టూరిజం ఏర్పాటుకు చర్యలు
లంక మల్ల అభయారణ్యంలో ఏకో టూరిజం ఏర్పాటుకు చర్యలు
Leave a Comment
Related Post