తిరుపతి అక్టోబర్ 4 (ఇయ్యాల తెలంగాణ );తిరుమలలో నిర్వహించనున్న శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను టీటీడీ వెల్లడిరచింది. ఈనెల 15 నుంచి 23 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల ఆరంభం నుంచి ముగింపు రోజు వరకు అష్టాదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు.ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహన సేవకు అనుతిస్తారు. 15న రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పెద్ద శేష వాహనంపై శ్రీవారి ఊరేగింపుతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 23న శ్రీవారి చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు.
- Homepage
- Telangana News
- ఈనెల 15 నుంచి 23 వరకు తిరుపతి బ్రహ్మోత్సవాలు
ఈనెల 15 నుంచి 23 వరకు తిరుపతి బ్రహ్మోత్సవాలు
Leave a Comment
Related Post