విజయుడు Vijay

తమిళనాడు, మే 04 (ఇయ్యాల తెలంగాణ) : 50 ఏళ్లుగా ద్రవిడ రాజకీయాలకు కంచుకోటగా ఉన్న తమిళనాడులో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్యనే సాగిన ద్విముఖ పోరుకు ఈసారి తెరపడింది. నటుడు  విజయ్ రాజకీయ ప్రవేశంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని రీతిలో అధికార డీఎంకే వెనకబడిపోగా, విజయ్ కొత్త పార్టీ, అన్నాడీఎంకే కూటమి  ఆధిక్యంలోకి దూసుకెళ్లడం సంచలనం సృష్టిస్తోంది.ఎన్నికలకు ముందు చాలా ఎగ్జిట్ పోల్స్ డీఎంకే సునాయాసంగా రెండోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే, ‘యాక్సిస్ మై ఇండియా’  సర్వే మాత్రం ‘విజయ్ ఎఫెక్ట’ బలంగా ఉంటుందని, ఆయన పార్టీ సుమారు 100 స్థానాలు గెలుచుకుని కింగ్మేకర్గా అవతరించే అవకాశం ఉందని ముందుగానే సూచించింది

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....