Kerala’ ఇకపై ‘కేరళం’..

న్యూఢిల్లీ, ఆగస్టు11, (ఇయ్యాల తెలంగాణ) : కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మారుస్తూ ప్రతిపాదించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మంగళవారం విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లును సభ మÖజువాణి ఓటుతో ఆమోదించింది. ఫలితంగా రాష్ట్రం పేరు మార్పు ప్రక్రియలో మరో కీలక ఘట్టం పూర్తయింది.కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో లేకపోవడంతో, ఆయన తరఫున హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ‘కేరళ (పేరు మార్పు) బిల్లు, 2026’ను ప్రవేశపెట్టారు. ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల చర్యలతో పాటు ఇతర కీలక అంశాలపై అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ గందరగోళ పరిస్థితుల నడుమనే బిల్లుకు సభ ఆమోదం ముద్రవేసింది.మలయాళంలో తమ రాష్టాన్ని ‘కేరళం’ అని పిలుస్తారని, అధికారికంగా కూడా అదే పేరును ఖరారు చేయాలని కేరళ శాసనసభ 2024 జూన్‌లో తీర్మానం చేసింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం, రాష్ట్రపతి ఈ ముసాయిదా బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపారు. 2026 జులైలో అసెంబ్లీ దీనికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ఈ బిల్లు ఆమోదంతో రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో సవరణలు జరగనున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....