తమిళ తంబిల అనూహ్య నిర్ణయం

తమిళనాడు, మే 04 (ఇయ్యాల తెలంగాణ) : తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి తెరదించుతూ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం  (TVఐ) సంచలన ఫలితాలను నమోదు చేస్తోంది.  50 ఏళ్లుగా తమిళనాడును శాసిస్తున్న రెండు ప్రధాన పార్టీల బైనరీ రాజకీయాలను విజయ్ బద్దలు కొట్టారు. కేవలం అభిమాన గణమే కాకుండా,  పట్టణ , పారిశ్రామిక ప్రాంతాల్లోని యువత ఓట్లు టీవీకే వైపు మొగ్గు చూపాయి. ముఖ్యంగా డీఎంకే కంచుకోటలుగా భావించే చెన్నై ఉప ప్రాంతాల్లోనూ, వెల్లూరు, కాంచీపురం వంటి ఉత్తర జిల్లాల్లోనూ టీవీకే  అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తూ ముందంజలో ఉన్నారు. డజనుకు పైగా స్థానాల్లో టీవీకే అభ్యర్థులు 3,000 ఓట్ల కంటే ఎక్కువ ఆధిక్యంలో ఉండటం విశేషం.టీవీకే ప్రధాన కార్యాలయం వద్ద సంబరాలు  అంబరాన్నంటుతుండగా, గ్రావిÖణ ప్రాంతాల ఈవీఎంల లెక్కింపుపై ప్రధాన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఏది ఏమైనా, విజయ్ ఎంట్రీతో తమిళ పాలిటిక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....