తమిళనాడు, మే 04 (ఇయ్యాల తెలంగాణ) : 50 ఏళ్లుగా ద్రవిడ రాజకీయాలకు కంచుకోటగా ఉన్న తమిళనాడులో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్యనే సాగిన ద్విముఖ పోరుకు ఈసారి తెరపడింది. నటుడు విజయ్ రాజకీయ ప్రవేశంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని రీతిలో అధికార డీఎంకే వెనకబడిపోగా, విజయ్ కొత్త పార్టీ, అన్నాడీఎంకే కూటమి ఆధిక్యంలోకి దూసుకెళ్లడం సంచలనం సృష్టిస్తోంది.ఎన్నికలకు ముందు చాలా ఎగ్జిట్ పోల్స్ డీఎంకే సునాయాసంగా రెండోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. అయితే, ‘యాక్సిస్ మై ఇండియా’ సర్వే మాత్రం ‘విజయ్ ఎఫెక్ట’ బలంగా ఉంటుందని, ఆయన పార్టీ సుమారు 100 స్థానాలు గెలుచుకుని కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం ఉందని ముందుగానే సూచించింది
