వెలచెర్రీలో ‘కలర్స్ 2.0’ వెల్నెస్ Centre ప్రారంభం

సౌతిండియా హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ చేతుల మీదుగా సెంటర్ ప్రారంభం


చెన్నై: ప్రముఖ వెల్నెస్ & హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స’ చెన్నై నగరంలో తన సేవలను మరింత విస్తరిస్తోంది. వెలచెర్రీ (Vవశ్రీజీఞష్ట్రవతీy)లోని మహేశ్వరీ నగర్‌లో 100 ఫీట్ రోడ్ వద్ద అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ‘కలర్స్ 2.0’ వెల్నెస్ సెంటర్‌ను సౌతిండియా హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ ఘనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం రిబ్బన్ కట్ చేసి సెంటర్‌ను ప్రారంభించిన ఆమెకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రియ భవానీ శంకర్ మాట్లాడుతూ, నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ పెద్ద సవాలుగా మారిందన్నారు. అందం అనేది కేవలం బాహ్య రూపానికి మాత్రమే పరిమితం కాదని, ఆరోగ్యకరమైన జీవన విధానం, సరైన ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టడం ద్వారా నిజమైన అందం వెలుగులోకి వస్తుందన్నారు. బరువు నియంత్రణ, చర్మం, జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి ఇలాంటి ప్రత్యేక వెల్నెస్ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. చెన్నై ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాల సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.

కలర్స్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్టాల్లో ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన తమ సంస్థ ఇప్పుడు తమిళనాడులో కూడా వేగంగా విస్తరిస్తోందన్నారు. కుంభకోణం తర్వాత చెన్నైలో మరో ప్రీమియం సెంటర్‌ను ప్రారంభించామని, ప్రస్తుతం వెలచెర్రీలో కొత్త బ్రాంచీ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. గత 22 ఏళ్లుగా వెల్నెస్ రంగంలో సేవలందిస్తున్న తమ సంస్థ, బరువు నియంత్రణ ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగించే ప్రత్యేక ప్రోగ్రామ్‌లను అందిస్తోందన్నారు.

ప్రస్తుతం తమ సంస్థలో 250 మందికి పైగా న్యూట్రిషనిస్టులు, వందమంది నిపుణులైన వైద్యులు, 2000 మందికి పైగా శిక్షణ పొందిన టెక్నీషియన్లు సేవలందిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఙS`ఈఆం ఆమోదం పొందిన పరికరాలతో అంతర్జాతీయ స్థాయి వెల్నెస్ సేవలను ‘కలర్స్ 2.0’ ద్వారా అందిస్తున్నామని చెప్పారు.

మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య అవసరాలు మారుతున్న నేపథ్యంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ సెంటర్‌ను రూపొందించామని తెలిపారు. చెన్నై ప్రజల జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వెల్నెస్ ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.

ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా డెర్మటాలజీ, వెల్నెస్ సేవలను సమగ్రంగా అందిస్తున్న సంస్థగా ‘కలర్స’ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. నిపుణులైన డెర్మటాలజిస్టులు, ఆధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన సిబ్బందితో వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడం తమ లక్ష్యమని తెలిపారు.

5ఎం విÖడియా ఆధ్వర్యంలో జైదీప్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక యువతతో పాటు పలువురు ప్రముఖులు, వెల్నెస్ రంగానికి చెందిన నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెలచెర్రీలో ప్రారంభమైన ‘కలర్స్ 2.0’ ద్వారా అత్యాధునిక వెల్నెస్ సేవలు మరింత చేరువ కావడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....