’ఓ..! సుకుమారి’ Movie నుంచి ‘ప్రేమ ప్రేమిస్తున్నా’ Song రిలీజ్

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన  విలేజ్ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’.  భరత్ దర్శన్ ఈ మÖవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మÖలి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. జూలై 17న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ క్రమంలో చిత్రం నుంచి ‘ప్రేమ.. ప్రేమిస్తున్నా’ అనే రొమాంటిక్, మెలోడీ పాటను విడుదల చేశారు. ఈ పాటను జేమ్స్ టకారా ఆలపించారు. పూర్ణాచారి లిరిక్స్ ఎంతో చక్కగా ఉన్నాయి. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. విలేజ్ వాతావరణం, హీరో హీరోయిన్ ట్రాక్, సింపుల్ కొరియోగ్రాఫీ పాటను అందంగా మలిచింది.

రజాకార్, పోలిమేర చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సి.హెచ్. కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తారు. బలగం ఫేం తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్, క చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్. స్వయంభు చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని పాటలు రాస్తున్నారు.ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: తిరువీర్, ఐశ్వర్య రాజేష్

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....