శ్రీనివాస మంగాపురం’ Movie జూలై 30న Grand గా రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్  పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఆకట్టుకునే ప్రచార చిత్రాలు, వీడియోలతో ఈ సినిమా ఇప్పటికే మంచి ఆదరణను పొందుతోంది.

ఈ రోజు చిత్ర బృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన మÖడు పాటలు, టీజర్లు, పోస్టర్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

అజయ్ భూపతి శ్రీనివాస మంగాపురంను సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. తన మార్క్ ఇంటెన్సిటీకి అందమైన ప్రేమకథ, పవర్‌ఫుల్ యాక్షన్‌ను జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటల్లో జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ తమ క్యూట్ లుక్స్‌తో పాటు ఆకట్టుకునే నటనతో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు.

ఈ చిత్రం అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోంది. జయకృష్ణ ఎSఅ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మాధవ్ కుమార్ గుళ్ళపాటి ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్.రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయడానికి చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

నటీనటులు: జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, మోహన్ బాబు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....