మైత్రీ Movie మేకర్స్ 4వ తమిళ చిత్రం ప్రారంభం

ప్రముఖ పాన్`ఇండియా నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స’ కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో వారి నాలుగవ తమిళ చిత్రాన్ని ప్రకటించారు. ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న నాలుగవ చిత్రం కావడం విశేషం. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు.

చెన్నైలోని ఓఖీఅ నగర్ మైత్రీ ఆఫీస్ లో జరిగిన పూజా కార్యక్రమంతో #ఓyబిష్ట్రతీతిTజీఎతిశ్రీ04 #ఆV4 ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిత్ర బృందం, పలువురు ప్రముఖ అతిథులు హాజరయ్యారు.ధృవ్ విక్రమ్, దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్, చిత్ర బృందంతో కలిసి ఈ శుభకార్యంలో పాల్గొన్నారు.

ముహూర్తం షాట్ కు దర్శకుడు కీర్తిశ్వరన్ క్లాప్‌బోర్డ్ కొట్టారు. దర్శకులు అధిక్ రవిచంద్రన్, రవికుమార్, కీర్తిశ్వరన్, ఆంటోనీ భాగ్యరాజ్, రాజా, శశి, ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ ఈ ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యారు.

నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం (ఆV4), ధృవ్ విక్రమ్‌ను పూర్తిగా మాస్`ఓరియెంటెడ్ అవతార్‌లో కనిపించనున్నారు. నటనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రలతో ప్రయోగాలు చేయడానికి పేరుపొందిన ధృవ్ , ఇప్పుడు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ కోసం సిద్ధమయ్యారు.

కరణ్ అరవింద్ కుమార్, సబీతో కలిసి ఈ చిత్రానికి స్కీన్‌ప్లేను కూడా అందించారు. ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని వికీ నిర్వహించనుండగా, జయసూర్య ఎడిటర్. కాస్ట్యూమ్ డిజైనర్ ప్రవీణ్ రాజా, ప్రొడక్షన్ డిజైనర్ జి.ఎం. శేఖర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్.  

త్వరలో ఇతర వివరాలు తెలియజేయనున్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....