‘వదలా’ Movie సోల్ ఫుల్ Title Song రిలీజ్

వెర్సటైల్, కమాండింగ్ స్కీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు.ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, థ్రిల్లింగ్ టీజర్ తో ఆసక్తిని రేకెత్తించిన టీం, ఇప్పుడు వదలా టైటిల్ ట్రాక్ ని రిలీజ్ చేశారు.ప్రేమ, బాధ, భావోద్వేగాలను ఆత్మీయంగా మిళితం చేసిన ఈ పాట ఒక సోల్‌ఫుల్ మెలోడీగా ఆకట్టుకుంటోంది. ఎర్రోజు శివకృష్ణాచారి అందించిన సాహిత్యం పాటకు మరింత డెప్త్ తీసుకురాగా, ప్రియా నారాయణ తన వోకల్స్ తో ప్రతి లైన్‌కి ప్రాణం పోశారు.

గపతి బాబు పై హృతికా శ్రీనివాస్ కి వున్న ఎమోషన్ ఈ పాటలో క్యాప్చర్ చేసిన తీరు ఆసక్తికరంగా వుంది. ఈ సాంగ్ ని చాలా లావిష్ గా చిత్రీకరించారు,సంగీతం, సాహిత్యం, పెర్ఫార్మెన్స్ అన్నీ కలిసి ‘వదలా’ టైటిల్ ను వినగానే గుర్తుండిపోయే మెలోడీగా నిలబెట్టాయి.

ఈ చిత్రానికి చోటా కె నాయుడు డీవోపీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్, లక్క్ష్మీ భూపాల రైటర్.

తారాగణం: జగపతి బాబు, లయ, హృతికా శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, జెన్నీ, రీను, కశ్యప్ రాజ్

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....